వారణాసీ – ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారంనాడు మరో రెండు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. నేడు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటిస్తారు.తన పార్లమెంట్ నియోజకవర్గమైన వారణాసీతో పాటు గోరఖ్ పూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మోడీ పర్యటిస్తారు. సుమారు రూ. 12 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మోడీ పాల్గొంటారు.
గోరఖ్ పూర్ రైల్వే స్టేషన్ లోని ఫ్లాట్ ఫారమ్ నెంబర్ 1 నుండి గోరఖ్ పూర్- లక్నో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును మోడీ ప్రారంభిస్తారు. మరో వైపు జోధ్ పూర్ – సబర్మతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ సహా పలువురు మంత్రులు, అధికారులు పాల్గొంటారు. మరో వైపు గోరఖ్ పూర్ రైల్వే స్టేషన్ రీడెవలప్ మెంట్ పనులను మోడీ ప్రారంభిస్తారు