వందేభారత్ రైలును మరోసారి ఎద్దు ఢీకొట్టింది. దీంతో పెను ప్రమాదమే తప్పింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఎద్దును ఢీకొట్టింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో రైలు ముందు భాగం దెబ్బతింది. ఇక.. ఘటనాస్థలిలోనే రైలును నిలిపివేశారు.
ఆ తర్వాత సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. రిపేర్లు పూర్తయిన తర్వాతనే రైలు బయలుదేరి వెళ్తుందని అధికారులు తెలిపారు. షెడ్యూల్ సమయం ప్రకారం రైలు.. రాత్రి 11.30గంటలకు విశాఖ చేరుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ ఘటన నేపథ్యంలో ఆలస్యమవుతుందని అధికారులు వివరించారు.
ఇక.. వందే భారత్ రైలు ఘటనలపై సోషల్ మీడియాలో ఫన్నీ ఫన్నీగా ట్రోలింగ్ జరుగుతోంది. బాలయ్య బాబు సినిమాలో డైలాగ్‌ని కోట్ చేస్తూ చాలామంది ట్రోలింగ్ చేస్తున్నారు..
ఎద్దు : నాకెదురొచ్చినా నీకే రిస్కు.. నేనెదొరొచ్చినా నీకే రిస్కు..
నీయయ్య… వందేభారత్ రైలు ఏమో కానీ.. ఇకమీదట పట్టాలమీద ఎద్దులకు మాత్రం ఫుల్ సేఫ్టీ అన్నమాట..
ఇట్లాంటి పిచ్చ పిచ్చ కామెంట్స్‌తో సోషల్‌మీడియాలో మోతక్కిస్తున్నారు.