Monday, November 18, 2024

‘వందే భారత్‌’ వచ్చేస్తోందోచ్‌.. ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ మధ్య వందే భారత్‌ రైలును.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 19న ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య తొలిసారి వందేభారత్‌ రైలు పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగే ఓ కార్యక్రమంలో ప్రధాని పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభిస్తారు. తొలుత సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ మధ్య నడవనున్న వందే భారత్‌ రైలును… ఆ తర్వాత విశాఖ వరకూ పొడిగించే అవకాశాలున్నాయని సమాచారం. సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద స్టేషన్ సికింద్రాబాద్ ను రూ.699 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రంలో ఈ జాబితాలో ఉన్న మొదటి స్టేషన్‌ సికింద్రాబాద్‌. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ ప్రధాన కేంద్రం కూడా ఇక్కడే ఉంది.స్థానిక ఎంపీ, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement