Monday, November 18, 2024

Breaking | సుప్రీంకు వెళ్లనున్న వనమా.. హైకోర్టు తీర్పుపై సవాల్​!

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పుపై ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. ఈ నెల 25 హైకోర్టు తీర్పు ఇవ్వగా, ఆ వెంటనే వనమా సింగిల్​ జడ్జి బెంచ్​ ముందుకు లంచ్​ మోషన్​ పిటిషన్​ దాఖలు చేశారు. తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు. అయితే.. ఇరు వర్గాల వాదోపవాదనలు విన్న కోర్టు నిన్న ఆ తీర్పును రిజర్వ్​ చేసింది.

కాగా, ఇవ్వాల మధ్యాహ్నం కోర్టు తీర్పు వెలువరించింది. వనమా స్టే ఇవ్వాలన్న పిటిషన్​ని కోర్టు కోట్టేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు సమాచారం. వనమా తరపున న్యాయవాదులు ఢిల్లీలో వాదనలు వినిపించనున్నారు. రేపు (శుక్రవారం) సుప్రీంకోర్టు ఈ తీర్పుపై సవాల్​ చేయనున్నారు. దేశంలో ప్రముఖ న్యాయవాది వనమా వెంకటేశ్వరరావు తరపున వాదించనున్నట్టు తెలుస్తోంది. ఇక.. ఇప్పటికే ఈ విషయంలో బీఆర్​ఎస్​ పార్టీ అధిష్ఠానం వనమాకు సపోర్టుగా నిలిచింది. రాజకీయాల్లో ఇలాంటివన్నీ కామన్​గా జరుగుతాయని, అధైర్యపడొద్దని అధిష్ఠానం నుంచి భరోసా అందినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement