Tuesday, November 19, 2024

Valentine’s Day : ‘ప్రేమ ఎంత మధురం’

ప్రేమ.. రెండు హదయాలతో ముడిపడి ఉన్న ఈ రెండక్షరాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రేమ అనే సముద్రంలో మునిగిన వారికి ఈలోకం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. తమలో కలిగే భావనలను ఒకరితో ఒకరు పంచుకోవడానికి ఏర్పడిందే ప్రేమికుల దినోత్సవం. ప్రేమను పంచుకోవడానికైనా, పెంచుకోవడానికైనా అనుక్షణం ప్రత్యేకమైనదే. టీనేజ్‌లో ఉన్న యువతీ, యువకులది మాత్రమే ప్రేమ అనుకుంటే పొరపాటే. జన్మనిచ్చి, కనీపెంచిన తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్లదీ అంతులేని ప్రేమానుబంధమే.. యంగ్‌ ఏజ్‌లో వచ్చే ఆలోచనలతో కన్నవారిని కష్టపెట్టకుండా ఉండాలి. ప్రేమించిన వారితోపాటు.. అనురాగాన్ని, ఆప్యాయతను వారికీ అందివ్వాలి. ప్రేమించడం అంటే, ప్రేమను పంచడం అని అర్థం.. కానీ, నేటి పరిస్థితుల్లో ప్రేమించిన వారిని హింసించేలా కొంతమంది ఉన్మాదులుగా మారుతున్నారు. తమకు దక్కకుంటే మరెవ్వరికీ దక్కకూడదనే ఆలోచనలు మంచివికావు. ప్రేమికులు తమ ఆలోచనలతో రెండు కుటుంబాలకూ చెరువవ్వాలి.
ప్రభ న్యూస్‌ బ్యూరో, ఉమ్మడి మెదక్

ప్రేమ అంటే ఎలాగైనా వారిని పొందాలని అనుకోవడం కాదు. ప్రేమనే అందమైన భావనను అంతే అందంగా మలుచుకోగలగాలి. కొంతమంది ఈ విషయంలో నిజమైన ప్రేమను ఎవరూ పట్టించుకోరు అన్నట్లు ఒకవైపే మాట్లాడతారు. అది ఎప్పటికీ నిజం కాదు.. ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా సర్ది చెప్పుకుని ఒక్కటవుతారు. పెద్దలను ఒప్పిస్తారు. కొన్నిసార్లు ఆ పరిస్థితులు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు అదే ప్రేమతో ఇద్దరూ మాట్లాడుకుని పరిష్కారం చూసుకోవాలి.. ఆలోచించాలి.. చర్చించాలి.. కానీ తొందరపడకూడదు. అదే నిజమైన ప్రేమ. వాలెంటైన్స్‌ డే ఎందుకు

ఫిబ్రవరి 14నే దీన్ని ఎందుకు సెలబ్రేట్‌ చేసుకుంటారంటే.. క్రీ.శ 270 రోమ్‌ లో వాలెం-టైన్స్‌ అనే క్రిస్టియన్‌ ప్రవక్త ఉండేవాడు. అతనికి ప్రేమ అంటే చాలా ఇష్టం.. ప్రాణం.. ఎలాంటి వారి-కై-నా ప్రేమ వెంటు-ంటే జీవితం గడిచిపోతుందనుకునే వాడు. అలాగే భావించి యువతీ యువకులను ప్రేమించుకోవాలని ప్రోత్సహించేవాడు. దీంతో అతనికి ఎంతో మంది యువత అభిమానులుగా మారారు. అందులో రోమ్‌ చక్రవర్తి ప్లాటియస్‌ కుమార్తె కూడా ఉంది. ఇదంతా తెలుసుకున్న ప్లాటియస్‌.. దేశానికి వెలుగునివ్వాలని భావించే యువతను ప్రేమ పేరుతో ఆటలాడిస్తావా? అంటూ ఫిబ్రవరి 14న వాలెం-టైన్స్‌కు మరణశిక్ష విధించారు. ఇది జరిగిన రెండు శతాబ్దాల తర్వాత అంటే దాదాపు క్రీ.శ 496లో అప్పటి పోప్‌ ఫిబ్రవరి 14ను ప్రేమికుల రోజుగా ప్రకటించాడు. దీంతో అప్పటి నుంచి అందరూ ఆ రోజును వాలెం-టైన్స్‌ డేగా జరుపుకుంటు-న్నారు. కల్మషం లేని ప్రేమ

అజరామరం..
కొంతమంది అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రేమ వంచించబడుతోంది. దీంతో నిజమైన ప్రేమకు నీరాజనం చెప్పాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రతిఏటా ప్రేమికుల రోజు వస్తుంది.. పోతుంది. కానీ ఎంత మంది తమ ప్రేమను పండించుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ నిజమైన ప్రేమకు భాష్యం చెబుతున్నారో తెలుసుకోవాలి. ప్రపంచంలో ఏడో వింతైన తాజ్‌ మహల్‌ ను భార్య ముంతాజ్‌ పై షాజహాన్‌ ప్రేమకు హారతి పట్టిన కట్టడం. చరిత్రలోకి వెళితే సలీం.. అనార్కలీ ప్రేమ కోసం ప్రాణాలొడ్డారు. పార్వతి.. దేవదాసు, రోమియో.. జూలియట్‌ ల ప్రేమ అజరామరమైనది. పూర్వకాలంలోనే కాదు… ప్రస్తుత సమాజంలోనూ ఇలాంటి ప్రేమలు ఎన్నో ఉన్నాయి. నిజమైన ప్రేమ ఎప్పుడూ విజయం సొంతం చేసుకుంటు-ంది. కల్మషం లేని
ప్రేమ అజరామరమవుతుంది. అద్భుతమైన భావన ప్రేమ అనేది అద్భుతమైన భావన.. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ప్రేమలో పడే ఉంటారు. ప్రేమించిన వారికి ప్రేమను చెప్పాలని ఆరాటపడతారు.. అందుకోసం ఓ మంచి ముహూర్తం కూడా చూస్తారు. అలాంటి వారందరికీ ఈ వాలెం-టైన్స్‌ డే, వీక్‌ చాలా బాగా కలిసొస్తాయి. అయితే ప్రేమ ఫలానా రోజులో ఫలానా -టైమ్‌ కే పుట్టాలని ఏం లేదు.. ఏ రోజైనా పు-్టటొ-చ్చు.. ఏ సమయంలోనైనా పు-్టటొచ్చు.. అందుకే ప్రేమ గుడ్డిదంటారు.

అవగాహన ముఖ్యం..
ప్రేమికులిద్దరూ ఒకరినొకరు పూర్తిగా అర్ధం చేసుకోవాలి. అందరూ ఒకేలా ఉండరు. అలాగని ఒకేలా ఆలోచించరనే విషయాన్ని అవగతం చేసుకోవాలి. అలాంటప్పుడే ఒక అవగాహన ఏర్పడుతుంది. అంతేకానీ ప్రియుడు, ప్రియురాలు ఇలాగే ఉండాలన్న నిబంధనలేవీ లేవు. ప్రేమికులైనా.. భార్యాభర్తలైనా ఒకరికి నచ్చేలా మరొకరు ఉంటే ఇల్లూ,ఇల్లాలు స్వర్గమేకదా! నమ్మకం ఉండాలి.. ఇది అన్నిటికంటే సున్నితమైన అంశం. ఒక్కసారి నమ్మకం పోయిందంటే కష్టం.. అందుకని అసలు నమ్మకం పోయే పనుల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. కనీసం వేళాకోళాని-కై-నా అలాంటి విషయాల ప్రస్తావన తేకపోవడమే మంచిది. ప్రేమికుల మధ్య మూడో మనిషి ప్రమేయం లేకుండా చూసుకోవాలి. అనవసర అనుమానాలకు పోకుండా ఉంటే జీవితాంతం సుఖ సంతోషాలే..!!

అభిమానం..
ప్రేమికులిద్దరిలో ఎలాంటి భేదాభిప్రాయాలు, గొడవలున్నా వాటి ప్రభావం బయటపడకుండా చూసుకోవాలి. అంటే మనసులో ఎలాంటి అభిప్రాయం ఉన్నా.. ఆ విషయాల గురించి బయట వ్యక్తులకు చెప్పుకోవడం సరైన పద్ధతి కాదు. ఒకవేళ చెప్పాల్సి వస్తే మంచినే చెప్పుకోవాలి. అలా కానీ పక్షంలో ప్రేమ నౌక సగంలోనే మునిగిపోతుంది.

గుర్తింపు..
ఎదుటి వ్యక్తి అస్తిత్వాన్ని విధిగా గుర్తించి తీరాలి. ఒకరినొకరు గౌరవించుకోవడం తప్పనిసరి. ఒకవేళ తప్పు జరిగినా, ఉన్న నిజాన్ని గుర్తిస్తే ఎలాంటి సమస్యా ఉండదు.

అంతిమ లక్ష్యం..
రిలేషన్‌ షిప్‌ ను కాపాడుకోవడం అనేది ఏ ప్రేమికుల-కై-నా అంతిమ లక్ష్యం. ఈ రెండు కుటుంబాల కలయిక విషయంలో ఇరువురు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. దేనికైనా పరస్పర చర్చ.. ఓ శుభఫలితానికి కారణమవుతుంది.
ప్రేమికులారా … ఆల్‌ ది బెస్ట్‌..

ప్రణాళిక తప్పనిసరి..
ప్రేమికులంటే సినిమాలు, షికార్లకు వెళ్లడం కాదు. జీవితంలో తమకంటూ ఓ లక్ష్యాన్ని ఏర్పరుచుకొని ఇద్దరూ ముందుకెళ్లాలి. ఉద్యోగ విషయంలోనూ అంతే! జీవితంలో స్థిరపడ్డాకే పెద్దల వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే బెటర్‌. అలాగైతేనే ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా పోరాడతారు. ఒకవేళ పెళ్లికి పెద్దలు అడ్డుపడినా వారికి చ్చజెప్పాలి..చెబుతూనేఉండాలి.. చివరకు ఒప్పించాలి.ఇందుకు కొంత సమయం పడుతుంది.. అంతవరకు ఓపిక పడితే.. ఆ జీవితాలకు అంతకంటే ఆనందం ఏముంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement