సాధారణంగా చిన్నపిల్లలు ఇంజెక్షన్ అంటే ఏడుపు లంకించుకుంటారు. వారిని పెద్దలు సముదాయిస్తుంటారు. మరి అదే పెద్దవారు ఏడిస్తే.. ఏంటీ జోక్ అనుకుంటున్నారా.. లేదండి అక్షరాలా నిజం. ఓ బామ్మ వ్యాక్సిన్ వేయించుకోనని మారాం చేసింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగిలిగొండలో చోటు చేసుకుంది. అరికొట్ల సాభాగ్యమ్మ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకుంది. రెండో డోసు తీసుకోవట్లేదు. వైద్యసిబ్బంది టీకా వేసుకోవాలని కోరగా.. వద్దని సౌభాగ్యమ్మ వెక్కివెక్కి ఏడ్చింది. వైద్యసిబ్బంది నచ్చజెప్పి వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఏడుస్తుండటంతో స్థానికులు నీ పాణం కోసమే అవ్వా..’ అంటూ సముదాయించారు. మొత్తానికి ఈ వార్త వైరల్ గా మారింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement