ఇండియాలో కరోనా వైరస్ నియంత్రణకు వ్యాక్సినేషన్ ముమ్మరం చేశారు. కేంద్రం సహకారంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు కలిగినవారందరికీ వ్యాక్సిన్లు వేస్తున్నారు. త్వరలోనే 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు కలిగిన టీనేజర్లు, పిల్లలకు కూడా వ్యాక్సిన్లు వేయనున్నారు. జూలై తరువాత దేశంలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందని కొందరు నిపుణులు చెబుతుండటంతో అందరిలోనూ భయాందోళనలు నెలకొన్నాయి.
పైగా థర్డ్ వేవ్‌లో చిన్నారులపై కరోనా అధికంగా ప్రభావం చూపుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో… పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్‌ను భారత్ బయోటెక్ ప్రారంభించిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పేర్కొంది. ఐసీఎంఆర్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ గ్రూప్ అధిపతి డాక్టర్ ఎన్ కె అరోరా మాట్లాడుతూ.. చిన్నారులపై కోవిడ్ టీకా ట్రయల్స్ పూర్తికావడానికి నాలుగు నుంచి నాలుగున్నర నెలలు పట్టవచ్చని తెలిపారు. అక్టోబర్ చివరి నాటికి ఫలికాలు వస్తాయని భావిస్తున్నామన్నారు. ఈ లెక్కన ఈ ఏడాది నవంబర్ నాటికి రెండేళ్లు పైబడిన వయసు కలిగిన పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చే అవకాశాలున్నాయన్నారు.