దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలై ఆదివారం నాటికి 100 రోజులు పూర్తయింది. ఇప్పటి వరకూ రికార్డు స్థాయిలో 14.19 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. జనవరి 16 నుంచి ఇప్పటి వరకు 20,44,954 సెషన్లో 14,19,11,238 మందికి టీకా అందించారు. మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియలో 58.78 శాతం కేరళ, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రల లో జరిగింది. కొత్తగా నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే దేశంలోని మొత్తంలో
74.5 శాతం మాహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్,రాజస్థాన్ల నుంచే ఉంటున్నాయి.
100 రోజుల్లో…14.19 కోట్ల మందికి టీకా
Advertisement
తాజా వార్తలు
Advertisement