తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండటంతో ప్రభుత్వం తగు చర్యలు దిగుతోంది. అందులో భాగంగా మొన్న ఆక్సిజన్ సిలిండర్ల ట్రాన్స్పోర్ట్కు యుద్ధ విమానాలను రంగంలోకి దించగా.. రాబోయే రోజుల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం డ్రోన్లను వాడనుంది. ఈ మేరకు డ్రోన్ల వాడకానికి కావాల్సిన అనుమతులను తెలంగాణ ప్రభుత్వం పొందింది. డ్రోన్ల వినియోగానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి కోరగా.. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అన్ మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్(UAS) నిబంధనలు-2021 కింద ఏడాదిపాటు అనుమతినిచ్చింది. పౌరుల ఇంటి వద్దకే ఆరోగ్య సేవలు అందించడం ప్రధానోద్దేశం కాగా.. దేశంలో ఈ తరహా చర్యలు చేపట్టిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డుల్లోకి ఎక్కనుంది. అయితే ఏ కరోనా వ్యాక్సిన్ పంపిణీకి అనుమతి వచ్చిందనే విషయం మీద మాత్రం స్పష్టం లేదు. కాగా ఇప్పటికి దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ అనే రెండు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉండటం తెలిసిందే.
తెలంగాణలో వ్యాక్సిన్ పంపిణీకి డ్రోన్లు
By ramesh nalam
- Tags
- breaking news telugu
- CORONA VACCINE
- drones
- important news
- Important News This Week
- Important News Today
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- Most Important News
- telangana
- telugu breaking news
- Telugu Daily News
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today News in Telugu
- viral news telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement