Friday, November 22, 2024

తెలంగాణలో వ్యాక్సిన్ పంపిణీకి డ్రోన్‌లు

తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండటంతో ప్రభుత్వం తగు చర్యలు దిగుతోంది. అందులో భాగంగా మొన్న ఆక్సిజన్ సిలిండర్ల ట్రాన్స్‎పోర్ట్‎కు యుద్ధ విమానాలను రంగంలోకి దించగా.. రాబోయే రోజుల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం డ్రోన్లను వాడనుంది. ఈ మేరకు డ్రోన్ల వాడకానికి కావాల్సిన అనుమతులను తెలంగాణ ప్రభుత్వం పొందింది. డ్రోన్‌ల వినియోగానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి కోరగా.. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అన్ మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్(UAS) నిబంధనలు-2021 కింద ఏడాదిపాటు అనుమతినిచ్చింది. పౌరుల ఇంటి వద్దకే ఆరోగ్య సేవలు అందించడం ప్రధానోద్దేశం కాగా.. దేశంలో ఈ తరహా చర్యలు చేపట్టిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డుల్లోకి ఎక్కనుంది. అయితే ఏ కరోనా వ్యాక్సిన్ పంపిణీకి అనుమతి వచ్చిందనే విషయం మీద మాత్రం స్పష్టం లేదు. కాగా ఇప్పటికి దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ అనే రెండు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉండటం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement