Saturday, November 23, 2024

జనగామ జిల్లాలో టార్గెట్ మించి వాక్సినేష‌న్: కలెక్టర్ శివలింగయ్య

జనగామ, ప్రభ న్యూస్: మహమ్మారి కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ తప్పనిసరి కావడంతో ప్రభుత్వం విధించిన టార్గెట్ కు మించి జనగామ జిల్లాలో వ్యాక్సినేషన్ జరిగింది. టీకా వేయడంలో మొదటి డోస్ 100% మించి పూర్తి చేసి రాష్ట్రంలో 20వ ర్యాంకులో ఉన్న జ‌న‌గామ‌ను ర్యాంకు మెరుగు చేసిన‌ట్టు అధికారులు తెలిపారు. అధికారుల కృషి ఫ‌లితంగా ఇప్పుడు 8వ‌ స్థానానికి వ‌చ్చింద‌ని జనగామ కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ జనగామ జిల్లాలో కరోనా మొదటి డోస్ వ్యాక్సినేషన్ ప్రభుత్వం విధించిన టార్గెట్ కు మించి పూర్తి చేయడం జరిగింద‌న్నారు. వాక్సినేషన్ కు సంబంధించి సెప్టెంబర్ లో జనగామ 20 స్థానంలో ఉంది అన్నారు. 4,05,081 మందికి వ్యాక్సినేషన్ చేయడం జరిగిందని.. ప్రభుత్వం విధించిన టార్గెట్ మించి వేయడం జరిగిందని పేర్కొన్నారు

జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్ తగ్గిందని వ్యాక్సిన్ మొదటి రెండవ డోసులు వేసుకున్నామని నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అప్రమత్తంతో భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రతిఒక్కరు మాస్క్ తప్పనిసరి ధరించి పరిశుభ్రతను పాటించాల‌ని కోరారు క‌లెక్ట‌ర్‌. భవిష్యత్తులో రాబోవు విపత్కర ఆరోగ్య సమస్యలపై జాగ్రత్తలు తప్పనిసరి అంతేకాకుండా పాఠశాల కాలేజీ బస్టాండ్ సినిమా ఫంక్షన్ హాల్స్ తదితర ప్రజలు రద్దీగల ప్రాంతాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని జనగామ జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement