రెండేళ్ల తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఖాళీ సమయం దొరికింది. దాంతో తన భార్య ఉపాసనతో వెకేషన్ కి ప్లాన్ చేశారట. ఈ విషయాన్ని ఉపాసన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. భర్తతో తన హ్యాపీ మూమెంట్ కి సంబంధించిన ఫోటో షేర్ చేసింది. మరి చరణ్-ఉపాసనల విహారం ఎక్కడకు, ఎన్ని రోజులనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. రెండేళ్ల క్రితం ఆఫ్రికా దేశంలో సఫారీ టూర్ కి వెళ్లారు. సాహసోపేతమైన ఈ టూర్ లో ఉపాసన, చరణ్ క్రూర మృగాల మధ్య గడిపారు. ఆఫ్రికా అడవుల్లో వెకేషన్ తో పాటు వైల్డ్ లైఫ్ ఫోటో షూట్ కూడా చేశారు. సదరు ఫోటోలను తమ ఇంటిలో ఓ ప్రదర్శన ఏర్పాటు చేసి మిత్రులను పిలిచి అనుభవాలను పంచుకున్నారు. అయితే ఈసారి టూర్ కొద్దిరోజులు మాత్రమే ఉండే అవకాశం ఉంది. మార్చి 25న ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)విడుదల నేపథ్యంలో చరణ్ ప్రమోషన్స్ లో పాల్గొనాల్సి ఉంది. దీని కోసం ఆయన త్వరగానే టూర్ ముగించుకొని రావచ్చు. ఇక శంకర్ తో రామ్ చరణ్ చేస్తున్న మూవీ భారీ ఎత్తున తెరకెక్కుతుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement