సార్ మూవీలోని సూపర్ హిట్ సాంగ్ వావాథి హీరో ధనుష్ వెర్షన్ ని లాంఛ్ చేశారు మేకర్స్. ఒరిజినల్ వెర్షన్‌ను మించిపోయేలా ధనుష్ వాయిస్‌తో సాగుతున్న ఈ పాట నెట్టింట సెన్సేషన్ సృష్టించడం పక్కా అని తాజా అప్‌డేట్‌తో అర్థమవుతోంది.
సార్ చిత్రంలో సముద్రఖని, తనికెళ్లభరణి, సాయికుమార్, నర్రా శ్రీనివాస్, హైపర్ ఆది ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్‌చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. సార్ చిత్రంలో మలయాళ నటి సంయుక్తామీనన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషించింది.జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేసిన మాస్టారు.. మాస్టారు (తెలుగు వెర్షన్), వావాథి (తమిళంలో) అంటూ సాగే ఈ పాట విడుదలై రోజు నుంచి నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ పాట తమిళ వెర్షన్‌ను ధనుష్ స్వయంగా రాయగా.. తెలుగులో రామజోగయ్య శాస్త్రి రాశారు. రెండు భాషల్లో ఈ పాటను శ్వేతా మోహన్ పాడింది.వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది.
సార్ నుండి సర్ ప్రైజ్.. వావాథి ధనుష్ వెర్షన్ సాంగ్ లాంఛ్
Advertisement
తాజా వార్తలు
Advertisement