Friday, November 22, 2024

చెస్‌ ఒలింపియాడ్‌లో ఉజ్జెకిస్థాన్‌, ఉక్రెయిన్​లకు స్వర్ణాలు.. రెండు కాంస్యాలతో సరిపెట్టుకున్న భారత్‌

తమిళనాడు రాష్ట్రంలోని మల్లాపూర్‌ వేదికగా 44వ అంతర్జాతీయ చెస్‌ ఒలింపియాడ్‌ 14వ సీడ్‌ జరిగింది. ఉజ్జెకిస్థాన్‌ స్వర్ణాన్ని గెలుచుకోగా, అమెరికాతోపాటు భారత్‌ టీమ్‌లు సిల్వర్‌, బ్రాంజ్‌ మెడల్స్‌ను ఓపెన్‌ విభాగంలో మెడల్స్‌ సాధించాయి. మహిళల విభాగంలో ఉక్రెయిన్‌ స్వర్ణం సాధించింది. జార్జియా సిల్వర్‌ అందుకుంది. ఇదే విభాగంలో భారత్‌ కాంస్యంతో సరిపెట్టుకుంది. మిగతా విభాగాల్లో భారత్‌ బహుమతులు అందుకుందని చెస్‌ ఒలింపియాడ్‌ ఫెడరేషన్‌ (ఫిడే ) తెలిపింది. 11 సీడెడ్‌లో భారత్‌ రెండవ టీమ్‌లో యువ ఆటగాళ్లు జర్మినీతో తలపడిన డి.గుకేష్‌, ఆర్‌.ప్రజ్ఞానంద తమ ప్రత్యర్థులపై 3-1 స్కోరుతో విజయం సాధించారు. నిహాల్‌ సరిన్‌, రేనుక్‌ సాద్వానిలో వారి వ్యక్తిగత ఆటలో జర్మనీపై పైచేయి సాధించినట్లు ఫిడే తెలిపింది.
ఓపెన్‌ సెక్షన్‌ ఫైనల్‌ రౌండ్‌లో నెథర్లాండ్‌పై ఉజ్జెకిస్థాన్‌ 2.5-1.5 స్కోరు సాధించింది. అలాగే అర్మేనియా టీమ్‌ స్పెయిన్‌పై 2.5-1.5 తేడాతో గెలుపొందింది.

రెండవ సీడెడ్‌లో భారత్‌ 1 టీమ్‌ టాప్‌ స్కోరు సాధించినా అమెరికన్‌తో తలపడే క్రమంలో 2-2తో పి.హరిక్రిష్ణ, విదిత్‌ సంతోష్‌లు డ్రాతో ముగించారు. అర్జున్‌ ఆటతీరును ముందుకు తీసుకెళ్లి డోమిజ్‌ను 49 ఎత్తుగడలు వేసి ఓడించినా.. ఎస్‌ఎల్‌ నారాయణన్‌ శాంక్లాండ్‌ చేతిలో ఓటమి పాలవడంతో భారత్‌ రెండవ సీడెడ్‌లో నాలుగవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మహిళా విభాగంలో భారత్‌ అమెరికన్‌ చేతిలో 1-3తో లీడ్‌ చేసి బ్రాంజ్‌తో సరిపెట్టుకుంది. తెలుగు చెస్‌ గేమర్‌ కోనేరు హంపితోపాటు వైశాలిలు గేమ్‌ను డ్రాతో ముగించగా.. తానియా సచ్‌దేవ్‌, భక్తి కులకర్ణిలు ఓటమి పాలయ్యారు.

సెకండ్‌ టేబుల్‌పై ఆడిన ఉక్రెయిన్‌ గేమర్లు పోలాండ్‌పై 3-1తో విజయం సాధించి స్వర్ణం సాధించారు. అజ్బెరియన్‌పై పోలాలండ్‌ 3-1తో విజయం సాధించి సిల్వర్‌తో సరిపెట్టుకుంది. భారత్‌ మెడల్స్‌ సాధించకపోయినప్పటికీ బోర్డుపై గుకేష్‌ అత్యుత్తమ ఆటతీరుతో ఒలింపియాడ్‌ ఓపెన్‌ సెక్షన్‌లో పలు బహుమతులు సాధించాడని చెస్‌ ఒలింపియాడ్‌ తెలిపింది. రెండవ బోర్డు పట్టికలో సారిన్‌ అగ్రశ్రేణిలో నిలువగా ఎర్గేసి మరియు ప్రగ్నానంద రెండు, మూడవ శ్రేణిలో నిలిచారు. మహిళా విభాగంలో భారత్‌ ఒలింపియాడ్‌ బోర్డు బహుమతులు గెలుచుకుంది. అంతర్జాతీయ చెస్‌ ఒలింపియాడ్‌ ముగిసేసరికి ఆటతీరును బట్టి చెన్నైకి చెందిన వైశాలి, సచ్‌దేవ్‌, దివ్య, దేశ్‌ముఖ్‌లు మూడు, నాలుగు, ఐదవ ర్యాంక్‌లు సాధించినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement