ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. మంగళవారం సాయంత్రం నుంచి ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి, చికిత్స అందిస్తున్నట్లు లక్నోలోని సంజయ్ గాంధీ పీజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెల్లడించింది. ఊపిరి తీసుకోవడంలో ఆయనకు ఇబ్బందులు తలెత్తాయని తెలిపింది. కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ వైద్యనిపుణులు ఆయన్ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని పేర్కొంది. మరోవైపు కల్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు.
కాగా, 89 ఏళ్ల కల్యాణ్ సింగ్… ఇన్ఫెక్షన్ కారణంగా జులై 4న ఆస్పత్రి ఐసీయులో చేరారు. బాబ్రీ మసీదు ఘటన సమయంలో కల్యాణ్ సింగ్ ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. రాజస్థాన్ గవర్నర్‌గానూ ఆయన పనిచేశారు.