ఉత్తరాఖండ్‌లో బీజేపీ ఘన విజయం సాధించినా.. సీఎంగా ఉంటూ పరాజయం పాలైన పుష్కర్ ధామీ శుక్రవారం రాజీనామా సమర్పించారు. 70 స్థానాల్లో 47 సీట్లను బీజేపీ చేజిక్కించుకుంది. పుష్కర్ ధామీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా తన రాజీనామాను గవర్నర్‌కు అందజేశారు. ఆయన్ను కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధరమ్మ సీఎంగా ఉండాలని కోరారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాట్లు మొదలయ్యాయి. సిట్టింగ్ సీఎం ఓటమితో.. బీజేపీ అధిష్టానం కూడా కొత్త సీఎం ఎంపిక కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం ఇద్దరు కేంద్ర మంత్రులను డెహ్రాడూన్‌కు పంపింది.
బీజేపీ అధిష్టానం దూతలుగా అక్కడికి వెళ్లిన కేంద్రం మంత్రులు కైలాష్ విజయ్ వర్గీయ, ప్రహ్లాద్ జోషి పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. మరో ఇద్దరు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్‌లను ఉత్తరాఖండ్ సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను అధిష్టానం అప్పగించింది. వీరు త్వరలోనే డెహ్రాడూన్ వెళ్తారు. ఉత్తరాఖండ్ సీఎం రేసులో మాజీ సీఎం పుష్కర్ ధామీ ఉండకపోవచ్చని సమాచారం. ఉత్తరాఖండ్ సీఎం రేసులో సత్పాల్ మహరాజ్, ధన్ సింగ్ రావత్‌లు ఉన్నారు. వీరిలో ఒకరికి అవకాశం దక్కుతుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..