ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఇంకా రెండేళ్ల పదవీ కాలం మిగిలి ఉండగానే బుధవారం ఆమె రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కాగా, 2018లో కేంద్ర ప్రభుత్వం బేబీ రాణి మౌర్యను గవర్నర్‌గా నియమించింది. అయితే, పదవీ కాలం ఇంకా మిగిలి ఉండగానే ఆమె గవర్నర్ పదవినుంచి వైదొలగడంపై రాజకీయంగా చర్చనీయాంశమైంది. వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఆమె మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. గవర్నర్ కాక ముందు బేబీ రాణి మార్య బీజేపీలో పలు కీలక పదవుల్లో పని చేశారు.
ఇది కూడా చదవండి: కౌషిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిపై గవర్నర్ అసంతృప్తి