వివాదస్పద కామెంట్లు చేసే ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ కు కరోనా సోకింది. ఈ రోజు ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. దీంతో ఆయన హోం ఐసొలేషన్ లో ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు ప్రకటించాడు. ఈ మద్యే అమ్మాయిలు జీన్స్ ధరించడం పై వివాదస్పద కామెంట్లు చేశాడు తీరత్ సింగ్ రావత్. దీనపై దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో యువతుల వస్త్రధారణ మీద చేసిన తీరత్ సింగ్ రావత్ వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. జీన్స్ ధరించడం పట్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ చిరిగిన జీన్స్ ధరించడం మాత్రం సమంజసం కాదని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఇళ్లలో ఉండే వాతావరణం గురించి మాత్రమే మాట్లాడానని.. మంచి విలువలు, క్రమశిక్షణతో పెరిగిన చిన్నారులు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరని ఆయన చెప్పుకొచ్చారు. అయితే నిన్న మరో కామెంట్ చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు రావత్. పేదవారికి ఎక్కువ రేషన్ రావాలంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని కామెంట్ చేశాడు. దీనిపై నెటిజన్లు తీరత్ సింగ్ రావత్ ని విమర్శిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement