యువతుల వస్త్రధారణపై ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక ఎన్జీవోను నడుపుతున్న ఓ యువతి చిరిగిన జీన్స్ ను ధరించడాన్ని చూసి తాను షాకయ్యానని తీరత్ సింగ్ రావత్ అన్నారు. అలాంటి వస్త్రధారణతో ప్రజలను కలవడానికి ఆమె వెళ్తే… ఈ సమాజానికి ఆమె ఎలాంటి సంకేతాలు ఇస్తున్నట్టని ప్రశ్నించారు. .యువతులు మోకాళ్లను చూపుతూ ఉండే జీన్స్ ధరించడం వెస్టర్న్ కల్చర్ ప్రభావమేనన్నారు. పాశ్చాత్య దేశాల ప్రజలు మన దేశ సంస్కృతిని అనుసరిస్తూ పూర్తిగా శరీరాన్ని కప్పేసే వస్త్రాలను వేసుకుంటూ యోగా చేస్తుంటే… మనం మాత్రం నగ్నత్వం వైపు పరుగులు తీస్తున్నామన్నారు. వస్త్రధారణ ఎలా ఉండాలనేది మన ఇంటి నుంచే ప్రారంభమవుతుందని రావత్ అన్నారు. మనం ఏం చేస్తామో మన పిల్లలు కూడా అదే చేస్తారని చెప్పారు. శరీరం కనిపించే వస్త్రధారణ వల్ల లైంగిక వేధింపులను ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్నారు తీరత్ సింగ్ రావత్.
Advertisement
తాజా వార్తలు
Advertisement