Friday, November 22, 2024

Uttarakhand – స‌హ‌జీవనానికీ రిజిస్ట్రేష‌న్….. లేకుంటే రూ.25 ఫైన్, ఆరు నెల‌లు జైలు శిక్ష‌..

ఉత్తరాఖండ్‌.. యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలు చేసే తొలి రాష్ట్రం కానుంది. ఈ బిల్లును నేడు అసెంబ్లీలో ఆమోదించారు.. దీంతో ఆ రాష్ట్రంలో పలు నూతన నిబంధనలు అమలులోకి రానున్నాయి. లివ్‌ ఇన్‌ రిలేషన్‌లో ఉండాలనుకుంటున్న జంటలు ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవలసి ఉంటుంది.
‘లివ్-ఇన్’లో ఉంటూ, ఆ సంబంధాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించకపోతే ఆ జంటకు ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. 25వేల‌ జరిమానా లేదా రెండూ విధించే అవకాశాలున్నాయి. ‘లివ్‌ ఇన్‌’లో ఉంటున్న జంట ఈ రిజిస్ట్రేషన్‌తో స్వీకరించే రసీదు ఆధారంగానే అద్దె ఇల్లు, హాస్టల్ లేదా పీజీ సౌకర్యాన్ని పొందగలుగుతారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇటీవల సీఎం ధామీ ప్రభుత్వానికి సమర్పించిన యూసీసీ ముసాయిదాలో ఈ నిబంధన గురించి పేర్కొన్నారు.

‘యూసీసీ’లో ‘లివ్-ఇన్’ సంబంధం గురించి స్పష్టమైన వివరణ ఇచ్చారు. దీని ప్రకారం ఒక వయోజన పురుషుడు, ఒక వయోజన మహిళ మాత్రమే లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండగలుగుతారు. అలాంటివారు ఇప్పటికే వివాహం చేసుకోకూడదు లేదా మరొకరితో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో లేదా నిషేధిత సంబంధాలలో ఉండకూడదు. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్న ప్రతి వ్యక్తి తప్పనిసరిగా రిజిస్టర్డ్ వెబ్ పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇటువంటి రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్నాక రిజిస్ట్రార్ వారికి రిజిస్ట్రేషన్ రసీదుని అందజేస్తారు. ఆ రశీదు ఆధారంగా ఆ జంట ఇల్లు లేదా హాస్టల్ లేదా పీజీని అద్దెకు తీసుకోవచ్చు. అయితే ‘లివ్‌ ఇన్‌’ కోసం రిజిస్ట్రార్ రిజిస్టర్ చేయించుకున్న జంట ఆ విషయాన్ని తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు తప్పనిసరిగా తెలియజేయాలి. ‘లివ్ ఇన్’లో ఉంటున్న సమయంలో ఆ జంటకు పుట్టిన పిల్లలు ఆ జంటకు చెందిన చట్టబద్ధమైన పిల్లలుగా గుర్తింపు పొందుతారు. అలాంటి పిల్లలు వారి తల్లిదండ్రుల ఆస్తులపై అన్ని హక్కులను పొందుతారు. ‘లివ్-ఇన్’ రిలేషన్‌షిప్‌లో ఉంటున్నవారు విడిపోవాలనుకున్నా, తిరిగి ఆ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement