ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్ కన్నుమూశారు. అనారోగ్యంతో జూలై 4న ఆస్పత్రిలో చేరిన 89 ఏళ్ల కల్యాణ్‌సింగ్.. లక్నోలోని సంజయ్‌గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన రెండుసార్లు యూపీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014-2019 వరకు రాజస్థాన్ గవర్నర్‌గా సేవలందించారు.
కళ్యాణ్ సింగ్ యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో అయోధ్యలోని బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. బాబ్రీ విధ్వంసం తర్వాత యూపీలో రాష్ట్రపతి పాలన కొనసాగించారు. తిరిగి 1998 ఫిబ్రవరి నుంచి 1999 నవంబర్ వరకు రెండో సారి ముఖ్యమంత్రిగా కళ్యాణ్ సింగ్ పనిచేశారు. కాగా కళ్యాణ్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సంతాపం ప్రకటించారు.
ఈ వార్త కూడా చదవండి: కరోనా రోగి నుంచి వీర్యాన్ని తీసిన వైద్యులు