తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని అధిష్టానం నియమించిన నేపథ్యంలో సోమవారం నాడు టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఆరేళ్ల పాటు పీసీసీ చీఫ్‌గా ఉండే అవకాశం ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు మంత్రి పదవి, వర్కింగ్ ప్రెసిడెంట్ , పీసీసీ చీఫ్ పదవులను కట్టబెట్టిందని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్నాడని ఉత్తమ్ తెలిపారు. కొందరు ఆస్తులు కూడా అమ్ముకుని పనిచేస్తున్నారని, అందరికి పార్టీ అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు అభిప్రాయపడ్డారు.
తనకు పదవి ఉన్నా లేకున్నా.. పార్టీకి విధేయుడిలా ఉండి పనిచేస్తానని స్పష్టం చేశారు. 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చేలా తన వంతు కృషి చేస్తానని ఉత్తమ్ తెలిపారు. అయితే ఆదివారం నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్లపై మాత్రం ఉత్తమ్ స్పందించలేదు.