యూటీఐ మ్యూచువల్ ఫండ్ సరికొత్త స్కీంతో ముందుకు వచ్చింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 150 క్వాలిటీ 50 టోటల్ రిటర్న్ ఇండెక్స్ (టీఆర్‌ఐ), యూటీఐ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ రెప్లికేటింగ్/ట్రాకింగ్ ఓపెన్ ఎండ్ స్కీమ్‌ను ప్రారంభించింది. కొత్త ఫండ్ ఆఫర్ మార్చి 28న ప్రారంభమైంది. 2022, ఏప్రిల్ 5వ తేదీతో ముగుస్తుంది. ఈ స్కీం సబ్ స్క్రిప్షన్, రిడీమ్ కోసం 2022, ఏప్రిల్ 15 నుంచి కొనసాగుతున్న ప్రాతిపదికన మళ్లిd ప్రారంభించబడుతుంది. యూటీఐ ఏఎంసీ ఆర్బిట్రేజ్ అండ్ క్వాంట్ స్ట్రాటజీస్ హెడ్ ప్యాసివ్ శర్వన్ కుమార్ గోయల్.. స్కీం ఫండ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాకింగ్ లోపానికి లోబడి, ఖర్చులకు ముందు, అండర్‌లైనింగ్ సూచీ ద్వారా సూచించబడిన సెక్యూరిటీల మొత్తం.. రాబడికి దగ్గరగా ఉండేలా.. పెట్టుబడి లక్ష్యంగా.. ఈ స్కీం తీసుకొచ్చినట్టు వివరించారు. నిఫ్టీ మిడ్ క్యాప్ 150 క్వాలిటీ 50 ఇండెక్స్ స్టాక్ స్థాయిలో విభిన్న ఎక్స్‌పోజర్‌ను అందిస్తుందన్నారు.
ప్రతీ స్టాక్‌కు కేటాయించిన గరిష్ట వెయిట్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్‌లోని స్టాక్ వెయిట్ కంటే.. 5 శాతం లేదా 5 రెట్లు తక్కువగా ఉంటుందన్నారు. యూటీఐ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ అనేది తక్కువ ధర స్మార్ట్ బీటా ఇండెక్స్ అని తెలిపారు. ఇది నిఫ్టీ మిడ్ క్యాప్ 150 క్వాలిటీ 50 ఇండెక్స్‌ను నిష్క్రియంగా ట్రాక్ చేస్తుందని, కొత్తగా ప్రారంభించిన స్కీం ట్రాకింగ్ లోపాన్ని తగ్గిస్తూ.. పెట్టుబడికి సమానమైన లాభాలను రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఎన్‌ఎఫ్‌ఓ వ్యవధిలో.. స్కీంకు సంబంధించిన యూనిట్లు.. ఫేస్ వ్యాల్యూతో విక్రయించబడుతాయి. ఒక్కో యూనిట్ రూ.10గా ఉంటుంది. రెగ్యులర్ ప్లాన్, డైరెక్ట్ ప్లాన్‌లు ఉన్నాయి. రెండు ప్లాన్లు గ్రోత్ ఆప్షన్‌ను మాత్రమే ఆఫర్ చేస్తాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..