Friday, November 22, 2024

స్మార్ట్‌ ఫోన్ల వినియోగం, డీలాపడ్డ ఇంటర్‌నెట్ సెంట‌ర్‌.. ఉపాధి కోల్పోతున్న నిర్వాహకులు

ప్రభ న్యూస్‌, రంగారెడ్డి డెస్క్‌ : నేటి సమాజంలో సాంకేతిక, కమ్యూనికేషన్‌ రంగంలో వస్తున్న విప్ల వాత్మక మార్పుల వల్ల ప్రపంచమే స్మార్ట్‌ ఫోన్‌ గుప్పిట్లోకి చేరిపోయింది. కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ ప్రస్తుతం ప్రతి మనిషితో మొదలుకుని యువత, విద్యార్థులకు కూడా నిత్యావసర వస్తువుగా మారి పోయింది. కొన్నాళ్లుగా ఇంటర్‌నెట్‌ అనేది ప్రజల జీవితాల్లో భాగస్వామ్యమై పోయింది. విద్యార్థులకు పాఠశాలు, కళాశాలలో ఇచ్చే అసైన్‌మెంట్‌, ప్రాజెక్ట్‌ వర్క్‌ను పూర్తి చేయాలన్నా, రైల్‌, బస్సు, సినిమా తదితర టికెట్లు రిజర్వేషన్‌ చేయాలన్నా, తమకు కావాల్సిన చిత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నా, ప్రపంచంలోని ఏ సమాచారం తెలుసుకోవాలన్నా కంప్యూటర్‌ ద్వారా ఇంటర్‌నెట్‌ను ఉపయోగించుకునే వారు. దీంతో అనేక ఇంటర్‌నెట్‌ కేంద్రాలు వెలిశాయి. మేడ్చల్‌ జిల్లాలోని కుత్బుల్లాపూర్‌ నియోజక వర్గంలో దాదాపు చిన్న, పెద్దవి కలిసి వందల సంఖ్యల్లో ఇంటర్‌నెట్‌ కేంద్రాలు ఉన్నట్లుగా సమాచారం. నిరుద్యోగులు స్వయం ఉపాధి కొరకై లక్షల రూపాయలు వెచ్చించి చిన్నపాటి స్టే షనరీ, జిరాక్స్‌, సెంటర్లతో పాటు ఇంటర్‌నెట్‌ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగించే వారు. ఇలా ఎంతోమంది నిరుద్యోగులకు ఇంటర్‌నెట్‌ కేఫ్‌లు ఉపాధిని కల్పించాయి.

స్మార్ట్‌ ఫోన్ల రాకతో ఢీలా పడ్డ ఇంటర్‌నెట్‌ కేంద్రాలు..

ఉమ్మడి రంగారెడ్డితో పాటు తది తర ప్రాంతాల్లో ఒక్కో కాలనీలో సుమా రు ఐదు ఇళ్లలో సుమారు మూడు కంప్యూటర్లు ఉన్నట్లుగా సమాచారం. నేటి ఆధునిక సమాజం లో స్మార్ట్‌ ఫోన్ల వినియోగం పెరగడంతో పాటు ఇంటర్‌నెట్‌ ఆఫర్లు పుట్ట గొడుగుల్లా వచ్చి పడుతున్నాయి.తమకు కావాల్సిన సమాచారాన్ని ఆయా నెట్‌వర్క్‌ సిమ్‌ల ద్వారా ఇంటర్‌నెట్‌ డేటాను రీచార్జి చేయించుకుని సెల్‌ ఫోన్ల లోనే వారి వారి సమాచారాన్ని చూసుకుంటున్నారు. దీంతో ఇంటర్‌నెట్‌ కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకి తగ్గుముఖం పడడంతో ఢీలా పడాల్సిన పరిస్థి తి నెలకొంది. ఏడాది క్రితం ఇంటర్‌నెట్‌ కేంద్రాలకు ఏదైనా పనిమీద వెళితే క్యాబిన్‌ సమయానికి దొరికేది కాదు. సుమారు గంటపాటు వేచి ఉండాల్సిన పరిస్థి తి ఉండేది. కానీ నేటి సాంకేతిక సమాజంలో ఆండ్రాయిడ్‌, స్మార్ట్‌ ఫోన్లు అతితక్కువ ధరలకే లభించడంతో సామాన్యుడు సైతం స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసి ఇంటర్‌నెట్‌ను ఫోన్‌లోనే వాడడంతో ఇంటర్‌నెట్‌ కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోయిందని ఓ కేంద్రం నిర్వాహకుడు వాపోయాడు.

ఒకప్పుడు ఎస్‌టీడీ.. ఇప్పుడు ఇంటర్‌ నెట్‌..

ఒకప్పుడు ఎస్‌టీడీ, ఐఎస్‌డీ బూత్‌లు గల్లి.. గల్లిలో చిన్నచిన్న దుకాణాల్లో కుప్పలుతెప్పలుగా ఉండేవి. ప్రస్తుతం మార్కెట్‌లోకి సెల్‌ ఫోన్ల రాకతో ఎస్‌టీడీ, ఐఎస్‌డీ, కాయిన్‌ బాక్స్‌లు సైతం మూతపడ్డాయి. ప్రస్తుతం ఇంటర్‌నెట్‌ కేంద్రాల పరిస్థి తి కూడా ఇలాగే మారిపోయే ప్రమాదముందని కొంతమంది ఇంటర్‌నెట్‌ కేంద్రాల నిర్వాహకులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement