(ప్రభన్యూస్) : సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ఈ నెల 30వ తేదీతో ముగింపు పలకాలని కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయగా, మున్సిపల్ అధికారులు అందుకు సంబంధించిన అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తెలియజేస్తున్న విధానం ప్రకారం బాటీల్స్ డిటర్జెంట్ పేపర్లు, షాంపు ప్యాకెట్లు పాలిథిన్ బ్యాగులు ఫేస్ మాస్కులు కాఫీ కప్పులు తదితర వస్తువులు కూడా బ్యాన్ లిస్టులో ఉండడం కనబడుతుంది. ఇప్పటికి ఇప్పడుపై నిర్ణయం తీసుకోవడం కాకుండా సంవత్సరం కాలం నుండి రాబోయే పరిస్థితులను తెలియపరుస్తూ ఉంది. స్థానికంగా పనిచేసే అధికారులు ఒకవైపు ప్లాస్టిక్ ఉత్బాదనలు ఒకవైపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్ నిషేదం గురించి పత్రికాపరంగా జాగృతి పరిచినప్పటికీ ఎప్పటికప్పుడే సమస్యలు చూపిస్తున్న పరిస్థితి నెలకొంది.
శాశ్వాత పరిష్కారం కోసం ప్రజలకు అవగాన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్ నిషేదం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదం ప్రత్యక్షంగా అమలు చేసే క్రమంలో ఇబ్బందులు ఏర్పడతాయని ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు అవగాహన కల్పించవలసిందిగా పలుమరు కోరుతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ నిబంధనలు ప్రత్యక్షంగా అమలు చేసే క్రమంలో జరిమానాల పరంపర కాకుండా ప్రజలకు అవగాహన కల్పించి తదనంతరం చర్యలు చేపట్టినట్లయితే ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందని పలువురు కోరుతున్న పరిస్థితి నెలకొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.