టీ20 ప్రపంచ కప్‌లో బాగంగా నేడు జరుగుతున్న మ్యాచ్‌లో గ్రూప్ ఏలో ని యూఎస్ఏ – ఐర్లాండ్ జట్లు తలపడుతున్నాయి. కాగా, ఫ్లోరిడా లోని టర్ఫ్ గ్రౌండ్ స్టేడియం వేదికగా జరుతున్న ఈ మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగించింది. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది.
సూపర్ 8కు అడుగు దూరంలో అమెరికా..
తొలిసారి ఈ ప్రపంచకప్‌లోకి అడుగుపెట్టిన అమెరికా.. ఊహించిన దానికంటే మెరుగైన ప్రదర్శన చేసి.. ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తుంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఈ జట్టు.. సూపర్ 8కి మరో అడుగు దూరంలో ఉంది. మరోవైపు రెండు మ్యాచ్‌లు ఆడిన ఐర్లాండ్ రెండీల్లో ఓడి పాయింట్ల పట్టికలో –1.712 నెగిటివ్ రన్ రేట్ తో అట్టడుగున నిలిచింది.
అయితే, వర్షం కారణంగా నేటి మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ ఇస్తారు. ఆపై ఐదు పాయింట్లతో అమెరికా సూపర్ 8కి చేరుకుంటుంది. ఆ పరిస్థితుల్లో ఐర్లాండ్ తో పాటు పాకిస్థాన్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఐర్లాండ్ చేతిలో అమెరికా ఓడిపోతే పాకిస్థాన్‌తో కలిసొస్తుంది.
ఆ తర్వాత ఐర్లాండ్‌పై పాక్ జట్టు గెలిస్తే.. నెట్ రన్ రేట్‌తో అమెరికాను వెనక్కి నెట్టి సూపర్ 8కి చేరుకునే అవకాశం ఉంది. ఐర్లాండ్, పాకిస్థాన్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దైతే అమెరికా సూపర్ 8కి చేరుకుంటుంది. ఇప్పటికే టీమ్ ఇండియా హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్ ‘ఎ’ నుంచి సూపర్ 8కి బెర్త్ కన్ఫామ్ చేసుకుంది.