Friday, November 22, 2024

రష్యాకు సాయంచేస్తే తీవ్రపరిణామాలే: చైనాకు అమెరికా హెచ్చరిక

ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యా.. మరింత ముందుకెళ్లేందుకు ఇటీవల చైనా సాయం కోరినట్లు అమెరికా అధికారి ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. సైనిక పరికరాలు, ఆయుధాలు ఇవ్వాలని అభ్యర్థించింది అని వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం వెల్లడించింది. అయితే చైనా సాయం ఎందుకు కోరిందన్న వివరాలను మాత్రం సదరు అధికారి చెప్పలేదని పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను చైనా ఖండించింది. తమ నుంచి రష్యా ఎలాంటి సాయం కోరలేదని వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి లీ పెంగ్యూ వెల్లడించారు. రష్యాకు సాయం చేస్తే ఆ తర్వాత కచ్చితంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇప్పటికే చైనాను నేరుగా, వ్యక్తిగతంగా హెచ్చరించాం.

ఈ విషయంలో చైనా ముందుకెళ్లడాన్ని మేం అంగీకరించబోం. ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ సమయంలో ఏ దేశమైనా రష్యాకు లైఫ్‌లైన్‌గా ఉంటానంటే మేం ఒప్పుకునేది లేదు అని అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జాక్‌ సులివన్‌ వెల్లడించారు. రష్యా దండయాత్ర నేపథ్యంలో అమెరికా, చైనా ప్రతినిధులు సోమవారం రోమ్‌లో భేటీ కానున్నారు. అమెరికా తరఫున జాతీయ భద్రతా సలహాదారుడు జాక్‌ సులివన్‌, చైనా నుంచి విదేశాంగ విధాన సలహాదారుడు యాంగ్‌ జీచీ దీనికి హాజరుకానున్నారు. యుద్ధంపై రష్యా చేస్తున్న ప్రచారం, ఆ దేశంపై ప్రపంచ దేశాలు విధిస్తున్న ఆంక్షలు వంటి అంశాలు దీనిలో చర్చించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement