Monday, November 25, 2024

సీఎం జగన్ ఇంటి ముట్టడికి యత్నించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు… పరిస్థితి ఉద్రిక్తం

తాడేపల్లిలో సీఎం జగన్ నివాసం ముట్టడికి అర్బన్ హెల్త్ సెంటర్స్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ యత్నించింది. అయితే వీరిని పోలీసులు అడ్డుకోవడం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న అన్ని క్యాడర్‌ల ఉద్యోగులను సీఎం జగన్ కొనసాగించాలని అర్బన్ హెల్త్ సెంటర్స్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్‌ చేస్తోంది.

కరోనా మహమ్మారి సమయంలో టెస్టులు తాము చేశామని పేర్కొన్న ఉద్యోగులు… తమకు కరోనా పాజిటివ్‌ కూడా వచ్చిందని వాపోయారు. మొత్తం 5 వేల మంది ఉద్యోగుల భవిష్యత్‌ను నాశనం చేయవద్దని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఔట్ సోర్సింగ్‌ కోటాలో తీసుకున్న అపోలో యాజమాన్యం టెర్మినషన్ ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు. దీనిపై ప్రశ్నించేందుకే సీఎం జగన్‌ ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టామని పేర్కొన్నారు. న్యాయం కోసం వస్తే తమను అరెస్ట్ చేయడమేంటని ఉద్యోగులు ప్రశ్నించారు. కాగా ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ వార్త కూడా చదవండి: బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడి అరెస్ట్: డీజీపీ సవాంగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement