Tuesday, November 19, 2024

మునిసిపాలిటీలకు పట్ణణ ప్రగతి నిధులు.. రూ.697 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఇటీవలే నాలుగవ విడత పట్టణప్రగతిని విజయవంతంగా పూర్తి చేసుకున్న రాష్ట్రంలోని మునిసిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్ధిక ఏడాది 2022-23కిగాను బడ్జెట్‌లో కేటాయించిన పట్టణ ప్రగతి రాష్ట్ర ఆర్ధిక సంఘం మ్యాచింగ్‌ గ్రాంటు నిధులను రూ.697 కోట్లను గురువారం మంజూరు చేశారు. ఈ నిధుల్లో నుంచి నెలవారిగా కేటాయింపులుంటాయని పురపాలక శాఖ డైరెక్టరేట్‌ తెలిపింది.

జూన్‌ నెలకు సంబంధించి గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ)తో కలుపుకుని రూ.57 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. ఈ మ్యాచింగ్‌ గ్రాంటుకు కేంద్ర ఆర్ధిక సంఘం నిధులను కలిపి మునిసిపాలిటీలకు ప్రతి నెల పట్టణ ప్రగతి కింద రూ.100కుపైగా కోట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ నిధులతో నిర్వహణ, పెట్టుబడి వ్యయాలకు మునిసిపాలిటీలు వినియోగించుకోనున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement