యురేనియం ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఖనిజాలలో ఒకటి. అణుశక్తికి ఇది చాలా విలువైనది. జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ తర్వాత, ఇప్పుడు రాజస్థాన్‌లో యురేనియానికి సంభందించిన భారీ నిక్షేపాలు వెలుగులోకి వచ్చాయ. సికార్‌లోని ఖండేలా ప్రాంతంలో మైనింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. 1086.46 హెక్టార్ల విస్తీర్ణంలో యురేనియం అనుబంధ ఖనిజాల నిక్షేపాలు కనుగొన్నారు. దీంతో రాజస్థాన్‌కు ఉపాధి, పెట్టుబడి మార్గాలు పెరిగే అవకాశం ఉంది. సుమారు 12 మిలియన్ టన్నుల యురేనియం ఈ ప్రాంతంలో ఉండవచ్చని అధికారులు తెలిపారు.
కాగా, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) సుమారు రూ. 3,000 కోట్ల పెట్టుబడి పెట్టనుందని, దాదాపు 3,000 మందికి ప్రత్యక్షంగా, మరి కొంతమంది పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. అవసరమైన ఫార్మాలిటీలను పూర్తిచేసిన తర్వాత రాజస్థాన్‌లో మైనింగ్ చేస్తామని చెబుతున్నారు. యురేనియంతో ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తుల ఆధారంగా రాష్ట్రంలో ఇతర అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటు కానున్నట్టు తెలుస్తోంది. అణుశక్తితో పాటు, యురేనియం రక్షణ, ఔషధం, ఫొటోగ్రఫీ, ఇతర విభాగాలలో దీని వినియోగం ఉండనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.