యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2023, నవంబర్ 26 నుంచి డిసెంబర్ 3 వరకూ మెయిన్ పరీక్షలను నిర్వహించగా… అందులో అర్హత సాధించిన వారికి ఏప్రిల్ 22 నుండి మే 01 వరకు పర్సనాలిటీ టెస్ట్ నిర్వహించారు. అయితే ఇంటర్వ్యూ తుది ఫలితాలను ఇవ్వాల (మే 8) ప్రకటించారు. అభ్యర్థులు UPSC అధికారిక వెబ్సైట్ upsc.gov.in లో రూల్ నంబర్ తో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
UPSC ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ ప్రతి సంవత్సరం అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్, అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వంటి వివిధ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం నిర్వహిస్తారు. అర్హతగల అభ్యర్థుల ఎంపిక (ప్రిలిమినరీలు, మెయిన్స్, ఇంటర్వ్యూలు) మూడు దశల్లో జరుగుతుంది. ఇక రిక్రూట్మెంట్ ప్రక్రియ, లేదా UPSC IFS పరీక్షకు సంబంధించి సందేహాల నివృత్తి కోసం అభ్యర్థులు పని దినాలలో 10:00 AM నుంచి 05:00 PM మధ్య సమయంలో 011-23385271 / 23381125 టెలిఫోన్ నంబర్ ద్వారా అధికారులను సంప్రదించవచ్చు.