సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్-2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ విభాగంలో మొత్తం 861 ఖాళీలకు ప్రకటన విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు సివిల్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. డిగ్రీ ఫైనల్ ఇయర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫి కేషన్‌లో తెలిపింది. అభ్యర్థుల ఎంపిక విధానం ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధా రంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజుగా రూ.వందగా నిర్ణయించారు. మహిళలు, ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థు లకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియకు ఆఖరి తేదీ ఈనెల 22గా నిర్ణయించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..