Saturday, July 6, 2024

UP: రోడ్డు ప్రమాదం.. నూతన వరుడితో సహా నలుగురు సజీవ దహనం

యూపీలోని ఝాన్సీలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఝాన్సీ-కాన్పూర్ హైవేపై డీసీఎం, కారు ఢీకొన్నాయి. కొద్దిసేపటికే రెండు వాహనాల్లో మంటలు చెలరేగడంతో కారులోని వరుడితో సహా నలుగురు సజీవదహనమయ్యారు.

- Advertisement -

స్థానికులు ఇద్దరిని కాపాడారు. ఇద్దరికీ గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఝాన్సీ జిల్లా ఎరిచ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలాటి గ్రామంలో నివసిస్తున్న ఆకాష్‌కు మే 10న వివాహం జరిగింది. పెళ్లి ఊరేగింపుతో బడా గ్రామ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛపర్ గ్రామానికి వెళ్తున్నాడు. ఆ కారులో ఆకాష్ తన సోదరుడు ఆశిష్, మేనల్లుడు ఐషు(7) మరో ఇద్దరు బంధువులు ఉన్నారు. డ్రైవర్ భగత్ కారు నడుపుతున్నాడు. కారు బడా గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాన్పూర్ హైవేపై ఉన్న పారిచా ఓవర్ బ్రిడ్జి వద్దకు రాగానే వెనుక నుంచి వస్తున్న డీసీఎం వాహనం దాన్ని ఢీకొట్టింది.

దీంతో కారు, డీసీఎం వాహనం మంటల్లో చిక్కుకున్నాయి. మంటలను చూసి కారులో ఉన్నవారంతా కేకలు వేశారు. డీసీఎం డ్రైవర్ దూకి పారిపోయాడు. ప్రమాదాన్ని గమనించిన బాటసారులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఇంతలో వెనుక నుంచి కారులో వచ్చిన బంధువులు కారు అద్దాన్ని పగులగొట్టి ఇద్దరిని రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వరుడు ఆకాష్, సోదరుడు ఆశిష్, మేనల్లుడు ఐషు, డ్రైవర్ మంటల్లో చిక్కుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. పోలీసులు కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న నగర పోలీసు సూపరింటెండెంట్ జ్ఞానేంద్ర కుమార్ మాట్లాడుతూ.. కారులో 6 మంది ప్రయాణించినట్లు తెలిపారు. పెళ్లికొడుకుతో సహా మొత్తం నలుగురు సజీవదహనమైనట్లు చెప్పారు. ఆ మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement