Tuesday, November 26, 2024

Sky Walk – ఉప్ప‌ల్ స్కై వాక్ ట‌వ‌ర్ ను న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు అంకిత‌మిచ్చిన కెటిఆర్ ..

హైదరాబాద్‌లో అత్యంత రద్దీ కూడళ్లలో ఒకటైన ఉప్పల్ చౌరస్తాలో పాదచారులు రోడ్డు దాటేందుకు నిర్మించిన స్కైవాక్‌ టవర్‌ను మంత్రి కేటీఆర్ నేడు న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు అంకిత‌మిచ్చారు. . ప్రజల ఇబ్బందులను ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రూ.36.50 కోట్ల వ్యయంతో హెచ్‌ఎండీఏ దీనిని నిర్మించింది. ఎక్కడా రోడ్డు దాటే అవసరం లేకుండా అటు నుంచి ఇటు వైపు.. ఇటు నుంచి అటు వెళ్లేందుకు వీలుగా 665 మీటర్ల పొడవు, 4 మీటర్ల వర్టికల్‌ వెడల్పు, ఆరు మీటర్ల ఎత్తులో బస్టాపులు, మెట్రోస్టేషన్‌ను కలుపుతూ ఈ స్కైవాక్‌ను నిర్మించారు. 8 చోట్ల లిఫ్ట్‌లు,4 ఎస్కలేటర్స్‌, 6 చోట్ల మెట్ల సౌకర్యాన్ని కల్పించారు. నాగోల్ రోడ్డు, రామంతాపూర్ రోడ్డు, జీహెచ్ఎంసీ థీమ్ పార్క్, జీహెచ్ఎంసీ ఆఫీసు స‌మీపంలోని వ‌రంగ‌ల్ బ‌స్టాప్, ఉప్పల్ పోలీస్ స్టేష‌న్, ఉప్పల్ ఎల‌క్ట్రిక‌ల్ స‌బ్‌స్టేష‌న్ ఎదురుగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు.

స్కైవాక్‌ టవర్‌తోపాటు ఉప్పల్‌ భగాయత్‌లోని శిల్పారామంలో నిర్మించిన కన్వెన్షన్‌ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement