తెలంగాణ మంత్రి కే. తారక రామారావు సోమవారం కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. వానాకాలం పంటలపై ఏర్పాటు చేసే అవగాహన సదస్సులో పాల్గొంటారు. ఉదయం ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా కరీంనగర్ కు చేరుకొని ఉదయం 10-30 గంటలకు కరీంనగర్ బైపాస్ రోడ్ లోని వి కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరవుతారు. కరీంనగర్- రాజన్న సిరిసిల్ల జిల్లాల రైతు సదస్సులో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తో కలసి పాల్గొంటారు. కరీంనగర్ నుండి హెలికాఫ్టర్ లో జగిత్యాలకు చేరుకొని మధ్యాహ్నం 1-30 గంటకు జగిత్యాల- పెద్దపల్లి జిల్లాల వానాకాలం అవగాహన సదస్సులో పాల్గొంటారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..