Saturday, November 23, 2024

ఉపాస‌న బ‌ర్త్ డే – మెగా వారి కోడ‌లే కాదు – సామాజిక సేవ‌కురాలు కూడా

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ భార్య ..మెగా కోడలు ఉపాసన కామినేని సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటూ… సామాజిక సేవ కార్యక్రమాల్లో సైతం పాల్గొంటారు. ప్రస్తుతం ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ హీరోయిన్స్ కి ఉన్న రేంజ్​లో ఉన్నారు.
టాలీవుడ్​లో ఉన్న మోస్ట్​ క్రేజీ కపుల్స్​లో రామ్​చరణ్, ఉపాసన ఒకరు. వీరిద్దరూ వారి కెరీర్స్​లో వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ … ఖాళీ దొరికినప్పుడల్లా కలిసి సంతోషంగా గడుపుతుంటారు. సోషమీడియా లో ఒకరిపై ఇంకొకరు తమ ప్రేమను చాటుకుంటుంటారు. రామ్ చరణ్ ఉపసానలకి 14 జూన్​ 2012లో పెళ్లి జరిగింది. పాతికేళ్లకే ఒత్తిడితో కూడిన బాధ్యతలు తీసుకున్నా… ఏ రోజు విస్మరించలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ హాస్పిటల్ గ్రూప్​లలో మూడవ స్థానంలో ఉన్న అపోలో హాస్పిటల్​కి సంబంధించిన మేనేజ్మెంట్ పనులను ఉపాసన దగ్గరుండి చూసుకుంటున్నారు.

ప్రస్తుతం అపోలో చారిటీకి వైస్ ప్రెసిడెంట్​గా వ్యవహరిస్తున్నారు. బి పాజిటివ్ హెల్త్ మ్యాగజైన్​కు ఎడిటర్​గా ఉన్నారు. ఇన్ని పనులను విజయవంతంగా నిర్వహిస్తూనే కొణిదెల ఇంట కోడలుగా కుటుంబ సభ్యులందరీ మనసులను గెలుచుకున్నారు. రీసెంట్ గా స‌ద్గురుతో పిల్ల‌ల టాపిక్ ని తీసుకువ‌చ్చి వార్త‌ల్లో నిలిచారు. కాగా ఉపాస‌న ప్రముఖ వ్యాపార వేత్త, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనమరాలు . తల్లిదండ్రులు శోభ కామినేని, అనిల్ కామినేని.. 20 జూలై 1989లో ఉపాసన జన్మించారు. ఆమెకు నలుగురు అక్కా చెల్లెల్లున్నారు. వీరిలో ఉపాసన రెండో వ్యక్తి. ఉపాసన కామినేని చిన్న వయసునుంచే వ్యాపార సామ్రాజ్య సంగతులను నేర్చుకున్నారు. పదిహేనేళ్లకే యు ఎక్సేంజ్ సేవా సంస్థను నెలకొల్పి పాత స్కూల్ పుస్తకాలను సేకరించి.. పేద పిల్లలకు అందించే వారు.అంతేకాదు మురికివాడల్లో అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు అపోలో హెల్త్ సిటీలో చికిత్స చేయించే వారు. ఆమె లండన్ రీజెన్ట్స్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement