Tuesday, November 26, 2024

మీ ఫస్ట్ బేబీని డెలివరీ చేయడాన్ని గౌరవంగా భావిస్తా.. డాక్టర్ జెన్నిఫర్ ఆస్టన్

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్నారు. ఆస్కార్ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన అక్కడకు వెళ్లారు. యూఎస్ లో పాప్యులర్ టాక్ షో గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో చరణ్ పాల్గొన్నారు. ఈ షోలో ప్రముఖ డాక్టర్ జెన్నిఫర్ ఆస్టన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చ‌ర‌ణ్ భార్య ఉపాసన ప్రెగ్నెంట్ అనే విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. చరణ్ తో జెన్నిఫర్ మాట్లాడుతూ…. మీ ఫస్ట్ బేబీకి డెలివరీ చేయడాన్ని గౌరవంగా భావిస్తానని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఉపాసన స్పందిస్తూ… డాక్టర్ జెన్నిఫర్ మీ మాటలు తనకు ఎంతో సంతోషాన్ని కలిగించాయని అన్నారు. మిమ్మల్ని చూడటానికి ఎదురు చూస్తున్నానని.. తమ బేబీకి డెలివరీ చేసేందుకు అపోలో హాస్పిటల్స్ లోని డాక్టర్ సుమన, డాక్టర్ రూమ సిన్హాలతో కలవాలని కోరారు. దీనికి సమాధానంగా… తనకు కూడా రావాలనే ఉందని డాక్టర్ జెన్నిఫర్ అన్నారు. ఇంకోవైపు, ఉపాసన అమెరికాలో డెలివరీ చేయించుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఉపాసన వ్యాఖ్యలతో డెలివరీ ఇక్కడే జరగనుందనే విషయం అర్థ‌మ‌వుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement