Sunday, October 6, 2024

UP – ముగిసిన రక్త పిపాస తోడేళ్ళ కథ – ఆపరేషన్ బేడియా సక్సెస్

ఉత్తర ప్రదేశ్ . లోని బహ్రెయిచ్‌ జిల్లాను కొన్ని నెలలపాటు వణికించిన తోడేళ్ల కథ ముగిసింది.ఆపరేషన్‌ భేడియా విజయవంతమైంది. బహ్రెయిచ్‌లో మనుషులపై దాడులు చేసిన ఆరు తోడేళ్లలో ఐదు ఇప్పటికే పట్టుబడగా తాజాగా గత రాత్రి ఆరో తోడేలును గ్రామస్తులు మట్టుబెట్టారు..మేకను వేటాడుతుండగా గ్రామస్తులు ఆరో తోడేలును కొట్టి చంపినట్లు అటవీ అధికారులు తెలిపారు.ఐదో తోడేలు పట్టుబడ్డాక 24 రోజులుగా ఆరో తోడేలు ఒక్కతే తప్పించుకు తిరుగుతూ అటవీ అధికారులను ముప్పుతిప్పలుపెట్టింది.

అయితే గ్రామస్తుల దాడిలో మరణించిన ఆరో తోడేలు మ్యాన్‌ఈటర్‌ అని చెప్పలేమని అటవీ అధికారులు అన్నారు. గత కొన్ని నెలలుగా బహ్రెయిచ్‌లో ఆరు తోడేళ్ల గుంపు అక్కడి ప్రజలపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేసింది. తోడేళ్లు జరిపిన దాడుల్లో తొమ్మిది మంది పిల్లలు, ఒక మహిళ మృతి చెందగా 50 మంది దాకా గాయపడ్డారు. ఆపరేషన్‌ భేడియా సక్సెస్‌ కావడంతో బహ్రెయిచ్‌ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement