Saturday, November 16, 2024

UP – కొత్త జంట‌తో స‌హా ఏడుగురి ప్రాణం తీసిన పొగ‌మంచు

వివాహ అనంత‌రం వాహ‌నం అత్తింటికి వ‌స్తుండ‌గా ప్ర‌మాదం
పొగ‌మంచుతో ఎదురుగా ఉన్న వ‌స్తున్నక‌నిపించిన‌ టెంపో
లోయ‌లో ప‌డ్డ రెండు వాహ‌నాలు
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఘ‌ట‌న‌

ల‌క్నొ – పొగమంచు ఏడుగురి ప్రాణాలు తీసింది. అప్పుడే పెళ్లి చేసుకుని వస్తున్న జంట కూడా మ‌ర‌ణించిన వారిలో ఉన్నారు.. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఈ ఉదయం జరిగిందీ విషాదం. ఝార్ఖండ్‌లోని వ‌ధువ ఇంట నిన్న సాయంత్రం వివాహమైంది. అనంతరం వాహనంలో ధాంపూర్‌లోని తిబ్డి గ్రామంలో నివాసముంటున్న మగ పెళ్లివారి కుటుంబం జార్ఖండ్‌కు చెందిన వధువుతో కలిసి మిని వ్యాన్ లో ఇంటికి తిరిగి వస్తుండగా ముందు వెళ్తున్న టెంపోను ఢీకొంది. ఈ ప్ర‌మాదంలో ఈ రెండు వాహనాలు రెండూ పక్కనే ఉన్న లోయలోకి పడిపోయాయి. ప్రమాద సమయంలో వధూవరులు, అత్తమామలు, వరుడి సోదరుడు సహా వాహనంలో 11 మంది ఉన్నారు. ప్రమాదంలో నవదంపతులతోపాటు వారి కుటుంబంలోని మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

- Advertisement -

పొగమంచు కమ్మేయడంతో బాధితులు ప్రయాణిస్తున్న వాహనానికి ముందు వెళ్తున్న టెంపో కనిపించకపోవడంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి మెరుగైన వైద్యసాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

కాగా, న‌వ వధువుకు స్వాగతం పలికేందుకు వరుని ఇంట్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవ్వుతూ డ్యాన్స్ చేస్తున్న ఆ కుటుంబంలోని వారంతా ఈ విషాద వార్త తెలియగానే షాక్‌కు గురయ్యారు. కొత్త పెళ్లికూతురుతో వరుడు ఇంటికి వస్తాడని ఎదురు చూసిన అతని కుటుంబ సభ్యులు వధూవరుల మృతదేహాలు ఇంటికి రావడంతో విషాదంలో మునిగిపోయారు. పెళ్లి దుస్తుల్లో విగతజీవులుగా మారిన నూతన దంపతులను చూసిన గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement