Thursday, July 4, 2024

UP లో పెను విషాదం..ఆద్యాత్మిక కేంద్రంలో తొక్కిస‌లాట‌.. 107 మంది దుర్మ‌ర‌ణం

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. హత్రాస్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరిగుతోంది. 107 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుండి అందిన లెక్కల ప్రకారం, 50-60 మంది మరణించినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. తొక్కిసలాటలో కనీసం 107 మంది మరణించారని హత్రాస్ జిల్లా కలెక్టర్ ఆశిష్ కుమార్ ధృవీకరించారు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. స‌హాయ కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్న‌కొద్ది మృత‌దేహాలు వెలుగు చూస్తున్నాయ‌న్నారు..

హత్రాస్ జిల్లాలో శివుడికి సంబంధించిన ధార్మిక కార్యక్రమం జరిగింది. కార్యక్రమం ముగియగానే, తొక్కిసలాట జరిగింది. మానవ్ మంగళ్ మిలన్ సద్భావనా సమాగం కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అకాస్మత్తులగా తొపులాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అంతా బయటకు వచ్చారని, డ్రెయిన్ పైన రోడ్డు నిర్మించారని, అంతా అందులోపడి నలిగిపోయారని చెప్పారు.

- Advertisement -

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎక్స్‌పై పోస్ట్‌లో తెలిపారు. ఇక ప్ర‌ధాని మోదీ సైతం ఈ దుర్ఘ‌ట‌నపై దిగ్ర్ర్బాంతి వ్య‌క్తం చేశారు.. స‌హాయ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొనేందుకు ఇద్దరు రాష్ట్ర మంత్రులు లక్ష్మీ నారాయణ్ చౌదరి, సందీప్ సింగ్ లు అక్క‌డికి చేరుకున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement