Friday, November 22, 2024

యూపీ సర్కార్‌, పంజాబ్‌ కాంగ్రెస్‌ ట్విటర్‌ హ్యాండిల్స్‌ హ్యాక్‌

భారత్‌లోని కీలక ట్విటర్‌ ఖాతాలపై హ్యాకర్లు పంజా విసిరారు. ఆయా ఖాతాలను తమ ఆధీనంలోకి తీసుకుని ఎన్‌ఎఫ్‌టీ (నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్స్‌) లపై ప్రకటనలను షేర్‌ చేశారు. వీరు హ్యాక్‌ చేసిన ఖాతాల్లో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ అధికారిక ఖాతాతోపాటు, పంజాబ్‌ కాంగ్రెస్‌ ఖాతా కూడా ఉన్నది. గతంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఖాతాను కూడా హ్యాక్‌ చేసిన విషయం తెలిసిందే. యూపీ ట్విటర్‌ ఖాతా హ్యాక్‌ అయిన కొన్ని నిమిషాల్లోనే దాన్ని అధికారులు పునరుద్ధరించారు. కానీ, పంజాబ్‌ కాంగ్రెస్‌ ఖాతాను తిరిగి ఆధీనంలోకి తీసుకోవడానికి కొంత సమయం పట్టింది. ఈ రెండు ట్విటర్‌ హ్యాండిళ్ల ప్రొఫైల్‌ చిత్రాలను, ఇతర వివరాలను హ్యాకర్లు మార్చేశారు. దీంతోపాటు ఎన్‌ఎఫ్‌టీలకు సంబంధించిన ఓ ట్వీట్‌ను పిన్‌ చేశారు. అంతకు ముందు రోజు యూపీ ముఖ్యమంత్రి కార్యాలయ ట్విటర్‌ హ్యాండిల్‌ను హ్యాక్‌ చేసి దాదాపు 500 ట్వీట్లు చేశారు.

వెంటనే ఆ ఖాతాను ట్విటర్‌ సస్పెండ్‌ చేసి.. నాలుగు గంటల తర్వాత పునరుద్ధరించింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. కొన్నాళ్ల క్రితం యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌, భారత వాతావరణ శాఖల ట్విటర్‌ హ్యాండిళ్లు కూడా హ్యాకింగ్‌కు గురయ్యాయి. తాజాగా యూపీ అధికారిక ఖాత, కాంగ్రెస్‌ పార్టీల ఖాతాలను కూడా హ్యాక్‌ చేసిన తీరు అలానే ఉంది. హ్యాకర్లు ప్రొఫైల్‌ పిక్చర్లలో ఓ కామిక్‌ చిత్రాన్ని ఉంచుతున్నారు. దీంతోపాటు డజన్ల కొద్దీ ట్వీట్లు చేసి వందల మందికి ట్యాగ్‌ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement