ఢిల్లీ- రాజధాని ప్రాంతంలోని నోయిడా, ఘజియాబాద్ తదితర ప్రాంతాల్లోని ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన గరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానా ఉత్తరప్రదేశ్ మీరట్‌కు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల చేతిలో హతమయ్యాడు. పశ్చిమ యూపీకి చెందిన అనిల్ దుజానాపై హత్యలు, దోపిడీలు, భూ కబ్జాలు వంటి కేసులు నమోదయ్యారు. మొత్తం 62 కేసుల్లో నిందితుడిగా ఉన్న అతను.. 2012 నుంచి జైల్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో 2021లో అతను బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే పాత కేసుల్లో కోర్టుకు హాజరుకాకపోవడంతోపాటు.. తనపై నమోదైన హత్య కేసులో కీలక సాక్షులను బెదిరిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే అతడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అతన్ని పట్టుకునే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో అనిల్ దుజానా హతమయ్యాడు.. ఇటీవలే గ్యాంగ్ స్టర్ కింగ్ అతీక్ , అతని సోదరుడు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే
Advertisement
తాజా వార్తలు
Advertisement