ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు రోగులకు వినూత్నంగా చికిత్స అందిస్తున్నారు. గుండె సంబంధిత రోగాలకు చికిత్స చేసే వైద్యుడు నీరజ్ రామాయణం, హనుమాన్ చాలీసా లాంటి పుస్తకాలతో గుండె వైద్యం చేస్తున్నారు.
ఓ వైపు మందులతో రోగులకు చికిత్స అందిస్తూనే, మరోవైపు ఇలాంటి మత గ్రంథాల సాయాన్ని తీసుకుంటున్నామని చెప్పారు నీరజ్. వీటని చదవడం వల్ల వారికి ఏకాగ్రత కుదిరి.. ఒత్తిడి తగ్గుతోందని మనసు ప్రశాంతంగా ఉంటుందని వివరించారు.