ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. ప్రస్తుతం యోగి సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. వైరస్ లక్షణాలు తనలో కనిపించడంతో పరీక్ష చేయించుకున్నానని, దాని రిపోర్ట్ పాజిటివ్‌గా వచ్చినట్లు ఆదిత్యనాథ్ తన ట్విట్టర్లో తెలిపారు. వైద్య చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. వర్చువల్ రీతిలో పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఇక యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌కు కూడా కరోనా సంక్రమించినట్లు ఇవాళే తన ట్విట్టర్లో వెల్లడించిన విషయం తెలిసిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement