ఝాన్సీ : బిజెపి పాలనలోని ఉత్తరప్రదేశ్లోని మరోఘోరం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఝాన్సీ పట్టణంలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో శుక్రవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభ రెస్వింf? 2చి పది మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు.
ఆస్పత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోని (ఎస్ఎన్సీయూ) వార్డులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగిన వార్డులో 47 మంది నవజాత శిశువులు ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే 31 మంది నవజాత శిశువులను సురక్షితంగా తరలించినట్టు అధికారులు తెలిపారు.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.శిశువుల మృతితో ఆస్పత్రి ఆవరణలో హృదయవిదారక వాతావరణం నెలకొంది.
తమ బిడ్డలు సురక్షితంగా ఉన్నారా.. లేదా అని తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు భావిస్తున్నారు. మిగిలిన రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.