Friday, November 22, 2024

Breaking | విరిగిన చెట్లు, తడిసిన ధాన్యం.. ఆగమాగం చేసిన అకాల వర్షం

క‌రీంన‌గ‌ర్ జిల్లాలో అకాల వ‌ర్షంతో రైత‌న్న‌లు ఆగ‌మాగం అయ్యారు. జిల్లాలోని ప‌లు మండలాల్లో కురిసిన అకాల వర్షం రైతులను ఆగమాగం చేసింది. బలంగా వీచిన పెనుగాలులకు సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై చెట్లు విరిగి రోడ్డుపై ప‌డ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రోడ్డుకు అడ్డంగా పడ్డ చెట్లను స్థానిక పోలీసులు ట్రాక్టర్లు, జే సి బి ల సహాయంతో తొలగించారు. వరి పంటను కోసి క‌ల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం రాళ్లవానకు తడిసి ముద్దయింది.

- Advertisement -

పలువురు మామిడి రైతుల తోటల్లోని మామిడి కాయలు నేల‌రాలడంతో తీవ్రంగా నష్ట పోయారు. రైతులు తమ ధాన్యాన్ని చూస్తూ రోదిస్తున్నారు. కొన్ని గ్రామాలలోని వ‌రికోయ‌కుండానే పంటచేలోని వరిధాన్యం రాళ్లవానకు పూర్తిగా నేల‌మ‌ట్ట‌మ‌య్యింది. దీంతో చేతికి వచ్చిన పంట కిలో కూడా చేతికి రాని పరిస్థితికి ఉంద‌ని రైతులు కంట త‌డి పెడుతున్నారు. అకాల వర్షలతో పాటు, వడగండ్లకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement