Wednesday, November 20, 2024

ఉక్రెయిన్‌-రష్యా మధ్య ఆగని యుద్ధం.. హింసాకాండకు 30 రోజులు

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ప్రారంభమై నెల రోజులు కావస్తున్నది. ఇరు దేశాలకు చెందిన వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. లక్షలాది మంది నిరాశ్రయురాలయ్యారు. సొంత దేశం వదిలి పొరుగున ఉన్న దేశాలకు వలస వెళ్లిపోయారు. రష్యా, ఉక్రెయిన్‌లకు చెందిన యుద్ధ ట్యాంకులు, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయి. ఉక్రెయిన్‌లోని అందమైన నగరాలు.. మసిబారిపోయాయి. ఎటు చూసినా.. క్షిపణుల దాడికి నేలకూలిన భవనాలు, చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, తుక్కుగా మారిపోయిన వాహనాలే కనిపిస్తున్నాయి. ఇంత జరిగినా.. రష్యా మాత్రం ఉక్రెయిన్‌పై పట్టు సాధించలేకపోయింది. తొలుత సైనిక స్థావరాలు, అధికార భవనాలు లక్ష్యంగా చేసుకున్న రష్యా బలగాలు.. ఆ తరువాత తమ పంథాను మార్చుకున్నాయి. ఇళ్లు, షాపింగ్‌ కాంప్లెక్సులు, జనావాసాలు, ఆస్పత్రులు, పాఠశాలలు లక్ష్యంగా దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో వేలాది మంది ఉక్రెయిన్‌ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

పుతిన్‌కు ఎదురుదెబ్బే!

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను హస్తగతం చేసుకుంటే.. విజయం తమదే అన్న రష్యా అధ్యక్షుడి పుతిన్‌కు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఇప్పటికీ కీవ్‌ను స్వాధీనం చేసుకోలేకపోయాడు. రష్యా బలగాలను.. ఉక్రెయిన్‌ సైన్యం ధీటుగా ఎదుర్కొంటున్నది. దీనికితోడు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ కూడా అక్కడే ఉంటు సైన్యంతో పాటు పౌరులను ఎంతో ఉత్సాహపరుస్తూనే ఉన్నాడు. పలుదఫాలుగా జరిగిన చర్చలు కూడా ఓ కొలిక్కిరాలేవు. దీంతో ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు తెగబడుతూనే ఉంది. అణ్వాయుధాలతో దాడుల చేస్తామని రష్యా హెచ్చరికలు కూడా జారీ చేసింది. హైపర్‌ సోనిక్‌ క్షిపణులతో ఇప్పటికే దాడులు చేసినా రష్యాకు.. ఉక్రెయిన్‌ ఆర్మీ ధీటుగానే సమాధానం ఇస్తూ వస్తున్నది. నాటోలో చేరే విషయంతో పాటు ఆయుధాలు విడిచిపెట్టేందుకు జెలెన్‌ స్కీ నిరాకరిస్తూనే ఉన్నారు. కీవ్‌, ఖర్కీవ్‌తో పాటు మరియుపోల్‌పై ముప్పేట దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఉక్రెయిన్‌ మాత్రం అస్సలు వెనుకడుగు వేయడం లేదు. పొరుగు దేశాల మద్దతు కూడగట్టుకోవడంలో జెలెన్‌ స్కీ కూడా ఎంతో ప్రయత్నిస్తూనే ఉన్నారు. పశ్చిమ దేశాలను కూడా విన్నవించుకున్నాడు. నో ఫ్లై జోన్‌ అమలు చేయాలని, ఉక్రెయిన్‌ పౌరులను కాపాడాలని యూరోపియన్‌ యూనియన్‌ దేశాలను కూడా కోరారు. కానీ.. ఎవరూ జెలెన్‌ స్కీకి అండగా నిలబడలేదు.

ఉక్రెయిన్‌కు బ్రిటన్‌ సాయం

తాజాగా ఉక్రెయిన్‌ కోసం 6వేల డిఫెన్సివ్‌ మిస్సైల్స్‌ను బ్రిటన్‌ రెడీ చేసింది. దాదాపు 13వేల క్వింటాళ్ల బరువు ఉండే రూ.306 కోట్ల విలువైన మిస్సైల్‌ను పంపించనుంది. నాటో జీ7 లీడర్స్‌ మీటింగ్‌లో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌.. ఉక్రెయిన్‌ కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీలో 6వేల మిస్సైల్స్‌, 25 మిలియన్‌ పౌండ్స్‌ ఫైనాన్షియల్‌ సపోర్టు ఇవ్వనున్నారు. బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌ కూడా 4.1 మిలియన్‌ పౌండ్స్‌ హెల్ప్‌ సపోర్టు, రష్యా లాంగేజ్‌ సరీసెస్‌కు కూడా అందజేయస్తామని తెలిపారు. బ్రిటన్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో.. ఉక్రెయిన్‌కు 10వేల మిస్సైల్స్‌, అదనపు నిధులు చేకూరనున్నాయని అంటున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement