ఖోఖో ప్రపంచకప్- 2025లో ఆతిథ్య భారత్ తన జోరును కొనసాగిస్తోంది. తొలి ప్రపంచకప్ లో ఆజేయంగా అప్రతిహత విజయాలతో అదరగొడుతున్న భారత మహిళల జట్టు.. పురుషుల జట్లు ఏకపక్షంగా మ్యాచ్‌లను గెలుపొందుతున్నాయి.
ఈరోజు జరిగిన సెమీ ఫైనల్స్‌లో భారత మహిళా, పురుషుల జట్లు తమ విజయాల పరంపరను కొనసాగించి అజేయంగా ఫైనల్స్‌లోకి ప్రవేశించాయి.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన సెమీస్ లో భారత మహిళల జట్టు దక్షినాఫ్రికాను 66 -16 పాయింట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. మరోవైపు ఇక్కడ జరిగిన పురుషుల పోరులో… దక్షినాఫ్రికాతో తలపడిన భారత జట్టు 162 – 42 పాయింట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఇక రేపు జరగనున్న ఫైనల్స్‌లో భారత మహిళల, పురుషుల జట్లు నేపాల్‌తో తలపడనున్నాయి.