Tuesday, November 26, 2024

అరకకు తగ్గని ఆధరణ.. గ్రామీణులకు కాడెడ్లతో ఉపాధి

(ప్రభ న్యూస్‌): పంట సాగులో కాడెడ్లు కీలక పాత్ర పోషిస్తాయి. పొలం చదును చేయడం నుంచి మొదలుకొని విత్తనం వేయడం, కలుపు తీయడం తదితర వాటికి ఎడ్లను ఉపయోగించడం పరిపాటి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్ని ఆధునిక యంత్రాలు వచ్చినా పత్తి, మొక్కజొన్న పంటలలో మాత్రం ఎద్దులను ఉపయోగించక తప్పడంలేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో అరకకు ఆదరణ తగ్గడంలేదు. ట్రాక్టర్లు, అత్యాధునిక యంత్రాల వినియోగంలో వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతుంది.

వర్షాధార పంటలు సాగుచేసే రైతులు పంటలలో కలుపు తీయడం కోసం నేటికీ గుంటుకలను ఉపయోగిస్తుం డడంతో అరకకు ఆధరణ పెరిగింది. ఎద్దులు ఉన్న రైతులకు చేతినిండా పని పశుగ్రాసం కొరత, మేపడానికి అడవులు తగ్గిపోవడం, కూలీల కొర తతో చిన్నకారు రైతులు పశువుల పెంపకాన్ని భారంగా భావిం చడంతో గ్రామాల్లో పశుసంపద రోజురోజుకు తగ్గిపోతుంది. గ్రా మాల్లో పదుల సంఖ్యలో ట్రాక్టర్లు దర్శనమిస్తున్నాయి. కానీ కొంత మంది రైతులు నేటికీ గ్రామాల్లో కాడెడ్లతోనే వ్యవసాయం చేస్తున్నా రు. దీంతో ఎద్దులు ఉన్న రైతులకు చేతినిండా పని దొరుకుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement