Friday, November 22, 2024

అపూర్వ సాహసికులు.. అగ్నిపర్వతం మీదుగా రోప్ వాకింగ్ !

అగ్నిపర్వతాల నుంచి నిప్పులు కక్కే లావాను చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటిది ఓ ఇద్దరు మిత్రులు అపూర్వ సాహసానికి ఒడిగట్టారు. తమ అడ్వెంచర్‌కు అత్యంత ప్రమాదకరమైన ఫీట్‌ను ఎంచుకున్నారు. నైరుతి పసిఫిక్‌ సముద్రంలో ఉన్న టన్నా దీవిలో ఒక యాక్టివ్‌ అగ్ని పర్వతం ఉంది. దాని పేరు యాసుర్‌. దీనిపైన ఒక తాడు కట్టి, ఆ తాడుపై కాళ్లతో నడవాలన్నది ఈ స్నేహితుల ఆలోచన. అనుకున్న ట్లుగానే, అగ్ని పర్వతం క్రేటర్‌కు 42 మీటర్ల ఎత్తులో తాడును కట్టి నడిచారు.

ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 856 అడుగుల దూరం ముందుకు సాగారు. దీంతో వీరి పేరిట గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ నమోదైంది. వీళ్ల డేంజరస్‌ ఫీట్‌కు సంబంధించిన వీడియోను గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ హ్యాండిల్‌లో పోస్టు చేయగా నెటిజన్లు నివ్వెరపోయారు. ఈ వీడియోలో ఒకానొక సందర్భంలో స్నేహితులు ఆ తాడుపై నడుస్తుండగా.. అగ్ని పర్వతంలో పేలుడు జరిగి, లావాఎగసి పడటం కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement